Wednesday, September 1, 2010

పరిచయం

మన తెలుగుభాష అతి ప్రాచినమైన భాష.తేనెలొలికే తెలుగు భాషా ప్రాశస్త్యం ఎంత చెప్పినా తనివి తీరనిది. "చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడుపెరుగు తెలుగు...". అమ్మదనాల,కమ్మదనాల తెలుగు నేలపై మన కవులు,కళాకారులు,గుడులు,గోపురాలు, మన తెలుగు సాంప్రదాయాలు, ఎంకిపా టలలోని పల్లెదనం అందాలు ,కూచిపూడి నాట్య వయ్యారాలు , కృష్ణమ్మగోదావరి తుంగభద్ర ల గలగలలు , కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు , శ్రీశైల మల్లన్న, ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ,భద్రాచల రామన్న, చల్లని కృపా కటాక్ష వీక్షణములు, బ్రహ్మ్మంగారి కలియుగ కాలజ్ఞాన సత్యములు ,వేమన పద్యముల నీతి, బద్దెన కవితా సుమతీ సూక్తులు,శ్రీ కృష్ణ దేవరాయలేలిన రతనాల సీమ ,పోరాటాల పురిటి గడ్డ తెలంగాణా వీరుల గడ్డ ,ఆహా! ఈగడ్డపై పుట్టడమే ఒక వరము కాదా మరి !.. ఓహ్! ఎన్ని చెప్పినా ఇంకా చెప్పా ల్సింది మిగిలే వుంటుంది.
అందుకే మన సంస్కృతీ సాంప్రదాయాలు మన ముందు తరాల వారికి పరిచయం చేద్దామని నా చిన్న ఆశ.అందుకు మీ అందరి సహకారం కూడా కావాలి.

No comments:

Post a Comment