గుర్తుకొస్తున్నాయీ ....లా లా లా

 మా అన్నపూర్ణమ్మ అత్తయ్య 
                                        ఆమె పేరుకు తగ్గట్టుగా వుండేది.భారీ కాయం,ఎక్కువ దూరం నడవ లేదు.వంటలు ఎంత బాగా చేసేదో తెలుసా! అబ్బ!ఎంత రుచిగా ఉండేవో!ఆమెకు ఒక్కడే కొడుకు,నాగబ్రహ్మం.అందరు నాగులు అంటుంటారు.బాగా చదివించారు.ఆ రోజుల్లో ఆయన లోకల్ ఫండ్ ఆడిటర్ అయ్యాడు.పక్కనే జమ్ములపాలెంలో ఐదు ఎకరాల మాగాణి,వరి బాగా పండుతుంది.లంకంత ఇల్లు.ఆ ఇంటి తలుపులమీద వీణ చెక్కించాడు మా తాతయ్య.అన్నట్టు.. మా అత్తయ్య వాళ్ళాయన పేరు చిన్నసుబ్బారాయుడు.పెద్ద మీసాలు,నొక్కుల జుట్టు,బక్కపలుచగా పంచ కట్టుకొని నడవటానికి చేతిలో వంకీకర్ర పెట్టుకొని హుందాగా ఉండేవాడు.ఆయన్ని మా అమ్మ,బాబాయ్ అని పిలిచేది,అత్తాయిని పిన్ని అనేది.అందుకే మేము అత్తాయ్,తాతయ్య అని పిలిచేవాళ్ళం.మేము మా అత్తాయ్ వాళ్ళింట్లోనే ఫై పోర్షన్ లో వుండేవాళ్ళం.
                                  మా ఇల్లు ఒక ప్రమాదంలో కాలిపోయింది.నాకు బాగా గుర్తు,బెస్తలపాలెంలో ఒకామె మధ్యాహ్నం వంటచేసుకుంటుంటే నిప్పు పడిందట,దాంతో నాలుగు బజార్ల అవతల వున్నా మా ఇల్లు కూడా తగులబదిపోయింది.అప్పటికి అన్ని సర్దుకున్నాం, కానీ చాల వరకు కాలి పోయింది.అమ్మ,నాన్న,ఇద్దరు తమ్ముళ్ళు,నేను,అక్క వున్నాం.అప్పుడు మా అత్తయ్య వచ్చి మా పరిస్థితి చూసి మమ్మల్ని  రైలుగేటు అవతల జమ్ములపాలెం రోడ్డులో వున్నా వాళ్ళ ఇంట్లో ఉండమంది.నాన్న సరే అన్నారు.అందరం సామాను సర్దుకొని వెళ్లాం.అలా మేము వాళ్ళింట్లో మేడమీద వుండేవాళ్ళం.
                           మా బావ(నాగులు, అత్తయ్య కొడుకు) ఫై పోర్షన్ లో చదువుకునే వాడు.పెళ్లి అయిన తర్వాత ఆయన ఒంగోలు వెళ్ళిపోయారు ఉద్యోగరిత్య.అందువల్ల మాకు వాళ్ళ ఇంట్లో వుండే అవకాశం దొరికింది.మా బాబాయి పిల్లలు చిన్నాడు,సుబ్బు,మా అత్తయ్య,మామయ్యా వుండేవారు.మేము ఇదుగురము,వాళ్ళిద్దరూ అందరం భలే గోల చేసేవాళ్ళం.ఎన్నో ఆటలు,పాటలు అసలు ఆరోజులు ఇప్పటికీ   నా కళ్ళముందు కనిపిస్తుంటాయి 
              మా అత్తయ్య వంట చేయాలంటే పెద్ద ప్రహసనంగా వుండేది.ప్రొద్దున్నే పొయ్యి కడిగి అందులో పొట్టు కొంచం తడిపి కూరేది.వంటింట్లో వాకిలికి ఎదురుగా పీట వేసుకుని , అన్నం,పప్పు,పచ్చడి,పులుసు ఆమెకు ఏమి చేయాలనిపిస్తే అవి చేసి కాని అక్కడనించి లేచేదికాదు .ఇప్పటిలాగా వంటచేయాలంటే పొయ్యి మీద పడేసి ఇవతలకి రావటం కాదు,వంట ఆమె చెయ్యాలంటే చిన్నాడు కాని,సుబ్బు కాని దగ్గర ఉండాల్సిందే.ఒరేయ్.".అది ఇవ్వరా ..","ఇది ఇవ్వర.." అంటూ వాటి పేర్లు చెప్పకుండా అడుగుతుండేది."ఏంటి అత్తాయ్,పేరు చెప్పవే.." అంటే,"నీ ఒలికి మండా", "ఒరేయ్ గుడ్డి నాశనం .." వంటి తిట్లు తిడుతూ ఉండేది  ఆ వయసులోమాకు అర్దమయ్యేవికావు.కాని వాటి అర్థం తెలియక పోయిన చచ్చేట్లు నవ్వుకునే వాళ్ళం, వాళ్ళతో పాటుగా మేమూ  తిట్లు తినే వాళ్ళం.మా మామయ్యను కూడా తిట్టేది.ఆయన మంచంలో ఉండేవాడు.నెత్తిమిద ముసుగువేస్కోని,పంచలో పడుకునేవాడు.హటాత్తుగా ఆయనకు నడుములు పడిపోయినందు వల్ల, ఆయన క్రింద కూర్చొని,పాకుతూ మెల్లిగా వెళ్ళేవాడు.ఆయనకు బీడిలు తాగే అలవాటు.రెండు వేళ్ళ మధ్యలో పెట్టుకుని గుప్పిట మూసి గాలి పీల్చి లాగేవాడు.అపుడు అత్తాయి,
"చాల్లే సంబడం..చింత చచ్చినా  పులుపు చావలేదు.." అనేది.
                      చిన్నాడు ఉన్నాడుగా, వాడ్ని పిలిచి,"ఒరేయ్!నాకు బీడిలు తెచ్చిపెడతావా "అని అనేవాడు.
వాడు "సరే తాతయ్య ,10 ఫై|| ఇస్తే తెస్తా.." అనేవాడు.
దానికి ఆయన"నా దగ్గిర పావలానే వుందిరా" అనేవాడు.
"అయితే తాతయ్య అత్తాయ్ ని  అడిగేదా"  అనేవాడు. 
దానికి ఆయన "వద్దురా ఆమె లేచిందంటే,ఇక నా పని అయిపోయినట్టే...దాన్లోనే నా బీడిలు కొని, నీకు ఏదైనా    తెచ్చుకో . .. "అనేవాడు.
"సరే అని -వీడు రోడ్డుమీద వున్నా పొట్టసాయిబు కొట్టుకెళ్ళి, ఆ పావలాకు, పప్పుముద్దలు,2 జీడీలు(ఇవి ఇప్పటి వాళ్లకు తెలుసో లేదో) కొనుక్కొని తిని..ఎప్పటికో మళ్ళి ఇంటికి వచ్చేవాడు.వాడి అడుగుల చప్పుడు విని మా తాతయ్య ,"ఏరా బీడిలు తెచ్చావా ?.."అంటే, వాడి సమాధానం విని మేము పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునే వాళ్ళం,
"నేను పరిగెత్తక పొయినా, జేబులోంచి పడిపోయింది తాతయ్యా! కాని తాతయ్యా, బీడిలు,పొట్టసాయిబు తన  షాపులోకి  వేయిన్చుకుంటూ  ఉంటాడు కదా! కింద పడతాయమో తెద్దామని ఇప్పటిదాకా వున్నా..."
"మరి పడ్డాయా ..??"అని మా అత్తాయ్ కేకలు పెట్టేది.
"ఓమ్మో!సూర్యకాంతం అరుస్తుంది" అని సందులోంచి నుండి వెనగ్గా వంటింటి గుమ్మం దగ్గరకు వచ్చి,
"పడలేదత్తాయ్-కట్టలు బాగా గట్టిగ కట్టారు" అనే వాడు.
"సర్లే నీళ్ళు తోడిపోయ్,తోట్టినిండా ! నీ బొంద!" అని వాడ్ని తిట్టేది.తాతయ్య ఇంకా తిడుతూనే ఉండేవాడు ,ఎక్కడికి పోతాయి బుద్దులూ .. అనే వాడు .ఇవన్ని అత్తాయి వినేది వెంటనే ఆమె ఎవరినీ..అంటున్నావు? అని కాస్త పెద్దగా  అనేసరికి తాతయ్య నసుగుతూ ఆపేస్తాడు , ఆమె  వాళ్ళ పుట్టింటి వారినంటే ఒప్పుకోదు  .వంటంతా అయ్యాక మెల్లిగా నాలుక బయటపెట్టి భారికాయాన్ని మోస్తూ మెల్లిగా నడచుకుంటూ వసారాలోకి వచ్చి నులకమంచంలో అబ్బా! అంటూ కూర్చునేది .ఆ సమయంలోనే సుబ్బు 'జాగ్రత్త అత్తాయ్ మంచం కోళ్ళు కిర్రు కిర్రు మంటున్నాయి ,అసలే పడ్డావంటే రైల్వే స్టేషన్ వారినడిగి క్రేన్ తేవాలి ..వాళిస్తారో లేదో!' అనికేక పెట్టి  మమ్మల్ని చూసి ముసిముసి గా నవ్వేవాడు అంటీ అందరం గొల్లుమని నవ్వేవాళ్ళం .                          

                   మా అత్తాయి కూడా మమ్మల్ని చూస్తూ నవ్వుతూ పోరా !వెధవ ! మూడుపూటలా తినటం కాదు పనికి పోమ్మన్నాగా  నారాయనని అడిగావా ? ఆ.. , రేపు రా! అన్నాడు, మరి పోతున్నావా ? అని అత్తాయి అనగానే, రేపు వడ్లు ఇంటికివస్తాయి దగ్గర వుంది కాటా చూసుకో రా అని నాగులు మామయ్య చెప్పాడుగా ఉత్తరములో, ముసలయ్యకూడా సుబ్బు నువ్వుండాలోయ్, అనిఅన్నాడు,నువ్వు పని.. పని.. పని,అని చంపుతావు,! అంటూ కోపంగా  ,అరిచాడు, వాడికి పనికిపోవడం అసలు ఇష్టముండదు, ఊరికే తిరగడం, భానుమతి గారి పాటలు కూడా పాడతాడు,అత్తాయి కూడా రేపు తనపనే  కదాని  ఊరుకుంది. తల పైకెత్తి మెట్ల వైపు చూస్తూ చిన్నమ్మాయి , విజయ కాలేజి నుండి ఇంకా రాలేదా? అని కేక పెట్టేది, ఆ అనేలోపే మా అక్కాయి కిందకు వెళ్ళిపోయేది, ఏమే విజయ రెండో ఆటకు సినిమాకు పోదామా? అని అడిగేది, ఏ సినిమా! రాముడు,భీముడు  రామారావు, ఇద్దరంట, జమున, ఎల్. విజయలక్ష్మి,  ఉన్నారంట ,  బాగున్నదట, ఇందాక పాలుపోసే చెంచమ్మ చెప్పింది, అనగానే పోదామత్తాయ్, అని ఇద్దరు ప్లాన్ వేయగానే, సుబ్బు అత్తాయి  దగ్గరకు వచ్చి అరచెయ్యి హస్తము లాగా పెట్టి అమ్మణ్ణి,"! అని పద్మనాభం, లాగ మోహము దగ్గరకు చెయ్యి  తీసుకు వెళ్లి మళ్ళి  వెనక్కు  పోనిచ్చె వాడు నేను మీతో వస్తా నోచ్;; అని ఎగిరేవాడు, అత్తాయి కూడా సరే అనేది. ఇక రాత్రికి  తొమ్మిది గంటలకల్లా  భోజనాలు చేసి వక్కపొడి నములుతూ వొరేయ్ సుబ్బు రిక్షా పిలుచుకురార అనేది, వాడు ఈటైములో గేటు దాటి రాడత్తాయ్, నువ్వు నడవాల్సిందే, అని ఏడిపించే వాడు,ఎట్టాకేలకు, రిక్షావాడు రానే వస్తాడు ;అత్తాయి మెల్లిగా గేటు బయటకు వచ్చి రాగానే సుబ్బు రిక్షాని ఒక కాలు ముందుకు ఒక కాలు వెనకకు వేసి గట్టిగా పట్టుకుని ఇక ఎక్కు, 'అత్తాయ్',   అనగానే, ఈమె  ప్రయత్నం మొదలు పెట్టేది రొప్పుతూ,;'  విజయ పట్టుకోవే, ప్రసాదు పట్టుకోరా, అని అందరిని పిలిచేది, అందరమూ పకపక నవ్వే వాళ్లము,' మొత్తానికి సీటు  క్రిందకు చేరేది, సినిమా హాల్లో ప్రొజెక్టర్, దగ్గర వుండేది మాకు బాగా తెలిసినాయన, పేరు కోటేశ్వర రావు, అక్కడ అయన ఈమె కుర్చీలో పట్టదని ఒక బల్ల వేయించేవాడు ఇక సినిమా చూసిన తరువాత ఇంటికి చేరేది.మరునాడు, ఆ సినిమా గురించి మా తాతయ్యకు చెప్పేది, అయన బలే నవ్వేవాడు, 
మా ఎలిమెంటరి  స్కూల్  రైలు పేటలో వుండేది, మా అత్తయి వాళ్ళ ఇంటిపక్కనుండి వెళ్ళాలి ముప్పలనేని         శేషగిరి రావు గారింటి ముందునుండి వెళ్ళేవాళ్ళం, ఆ రోడ్డు పట్టుకుని పొతే, ఒక పార్క్  వుంది అక్కడ రోజు ఆడుకునే వాళ్లము  బడిలో నా ఫ్రెండ్స్ గిరిజ కే.వి బి పద్మ రాణి మస్తాన్ వలీ;  ' ఇంకా చాలా మంది వుండేవాళ్ళము ఈ ఆడ పిల్లలు అందరు డాన్సు నేర్చుకునే వాళ్ళు . వాళ్ళంతా భలే బడాయి కొట్టేవాళ్ళు , డాన్సు మాస్టారు వాళ్ళింటికి వారానికి రెండు సార్లు వచ్చేవాడు, వీళ్ళు  బాగా నేర్చుకున్నారు, శ్రీరామనవమికి భావన్నారయనస్వామి గుడి దగ్గర పందిళ్ళు వేసేవాళ్ళు, అక్కడ డాన్సు చేసి మంచి పేరు సంపాదించారు, నేను కుడా మా నాన్న గారిని అడిగాను, నాన్న;, పద్మ, గిరిజ, వాళ్ళతోపాటు  డాన్సు నేర్చుకోనా అని, మా నాన్న గారు వద్దులే అమ్మాయ్, సంగీతం నేర్చుకో, అన్నారు, ఆ రోజుల్లో డాన్సు ఫీజు  ఇరువై ఐదు   రూపాయలు, చాల ఎక్కువ లాగ వుండేది, నేను అందుకే అని ఊరుకున్న, అయినా వాళ్ళిద్దరూ ప్రతి రోజు మాయింటికి వచ్చే వారు మేము ముగ్గురం తకిట, తకిట అంటూ డాన్సు , వేస్తుంటే మా అత్తాయి క్రింద నుండి కేకలు పెట్టేది ఒసేయ్,' చిన్నమ్మాయ్, డాబా పగేలేటట్టు ఆ గోలేంటే,! క్రిందకు రండి , ఇక్కడ ఎగరండి , అనేది, మా సుబ్బు పై కొచ్చి తదినం, తదినం , తలోన్గా తదినం అని ఎగిరేవాడు ఇంకా ఎగరండి, అని అత్తాయిని అరిపించేవాడు, మేము నవ్వులే, నవ్వులు తీరా ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళిద్దరూ అమ్మో మీ చాయాదేవి , అరుస్తున్ దేమోనే,   అని భయపడి చచ్చేవాళ్ళు,   మేమంతా నాలుగు , తరగతి నుండి ఆరవతరగతికి , జంమ్పు, చేసాము, ఎస్ .ఎ . హై స్కూల్ కి, ఆరవ తరగతి లోకి , సెక్షన్ ఎ ' లో నలభయ్ మందిమి , వుండేవాళ్ళం జానకి ,కూడా మా తరగతే మాఇంటికి ఎదురుగావుండేది , నా చిన్ననాటి స్నేహితురాలు , బాగా దగ్గరగా వుండేది తనకి నేనంటే చాలా ఇష్టం ,   రోజు మాయింటికి వచ్చేది, నేనువాళ్ళింటికి వెళ్ళే దానిని , పొట్టిగా ,తెల్లగా అందముగా , ఉండేది 'లేతమనసులు' సినిమాలో పప్పీ లాగా, మేకప్ చేసుకునేది ,బ్రహ్మినులమ్మాయి ,అయినా వాళ్ళింట్లో నాకు బాగా ఫ్రీ గ వుండేది, స్కూల్ లో అయితే ప్రతి డాన్సులో తను ఉండాల్సిందే, టీచర్స్ అందరు అవకాశాలు ఇచ్చే వాళ్ళు నేను పొడవుగా ఉంటానని మగ వేషాలకు తీసుకునే వారు, యానువాల్ ఫంక్షన్ జరిగితే కొన్నిదాన్సులు జానకివే ఉండేవి, మా ఇంట్లో మా నాన్నగారు జానకి ఫాన్ , రాగానే పాడు జానకి , అంటే మీనా' సినిమాలోని;'  మల్లె తీగ వంటిది మగువ జీవితం '  ,   అనేపాట పాడేది మా అత్తాయి కూడా బాగా మెచ్చు కునేది, అన్నట్టు మా స్కూల్ గురించి చెప్పా లేదు గదు, పది క్లాసు లుండేవి అందులో సెక్షన్స్ ఉండేవి ఎ,బి,సి ,డి  ఎంతమంది టీచర్స్ వుండేవారో నాకు ఆరవ తరగతి ,ఏదు వ తరగతి లో తెలుగు మాస్టారు రాధా కృష్ణ మూర్తి గారంటే చాలా చాలా ఇష్టం ,ఎనిమిదిలో తొమ్మిదిలో రాణి టీచర్ గారంటే చాలా చాలా ఇష్టం , వీళ్ళిద్దరూ పద్యాలు బాగా చదివి అర్దాలు చెప్పేవారు , పాడవోయి భారతీయుడా' అనే పాటకు నేను జానకి ,డాన్సు చేసాము నేను అబ్బాయిగా, జానకి అమ్మాయిగా,  మాటీచర్స్  మాష్టర్స్ మా హెడ్ మాష్టారు గారు,అందరూ  మెచ్చుకున్నారు .ఆయన పేరు ఇజ్రాయలు గారు అమ్మో అందరికి భయమే , ఎందుకంటే ఆయన రూపం అలావుండేది, క్రిస్టియన్ స్కూల్ కనుక అందరం ప్రయర్ చేసే వాళ్ళం అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడితే ఇక వాళ్ళ పని ఆరోజు ఫినిష్, అంత పనిష్మెంట్ వుండేది , చాల డిసిప్లిన్ వుండేది , ఆరోజుల్లోనే మా వసున్ధరమ్మ టీచర్ మా చేత రికార్డు వర్క్ చేయించే వాళ్ళు ,ఎనిమిదవ క్లాసులో అనుకుంట , మాకు సైన్సు సబ్జెక్టుకు, మాణిక్యం జార్జె, టీచరుగారు, పాటం చెబుతూ ప్రభువు మూడు రోజులు తరువాత చనిపోయి మళ్లీ లేచారు , మీలో ఎవరయినా ప్రార్దిస్తే కనిపిస్తారు అని చెప్పారు, స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్ళే టప్పుడు నేను జానకి , ఆవిషయం గురించి మాట్లాడుకున్నాము , ఏయ్, జానకి ఈరోజు సాయంత్రం మీఇంటికి వస్తా మీ మేడపయిన ప్రార్ధన చేద్దామా ! అని అడిగా , తను కూడా అదే అనుకుంటున్నదట ,' సరే అన్నది నేను ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి మా అమ్మకు చెప్పి జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళా , ఆన్టి  జానకి ఏది ,అనగానే పూలుకోస్తుంది వెనకాల ,పెరట్లో వున్నది వెళ్ళు, అనగానే పరిగేత్తు కుంటూ జానకి ,జానకి, త్వరగా రా', అనికేక పెట్టా ,; ఇద్దరం డాబా పయిన చాపమీద కూర్చుని ,అదికాదే ,నాకు డౌట్ వస్తుంది , నిజముగా ,; జరుగుతుంది అంటావా, ఏమోనే చూద్దాం,; అంది , ఇద్దరం మోకాళ్లమీద కూర్చుని:" ప్రభువా " ! మాకు ప్రార్ధన చేయడం రాదు , పూజ అయితే చేతనవు తుంది , మా అమ్మ గారు చేస్తారు రోజు చూస్తుంటాము , మరి టీచర్ చెప్పారు నువ్వు కనిపిస్తావని మాఇద్దరికి  , ఈరోజు  కనిపించు , అని'  ఆమెన్'  అన్నము ఒకేసారి , కాసేపు ఉండి ఇంటికి వచ్చాను ,ఆ రాత్రి కలలో ప్రభువు తెల్లటి వస్త్రాలలో"గుహలో నుండి బయటకు వచినట్లుగా , నాకు కనిపించారు, పొద్దున్నే నిదరలేవగానే మోహము కూడా కడగకుండా, జానకి అంటూ వాల్లిన్టికి  వెళ్ళా నీకు కనిపించార , ప్రభువు' ! ఆ '! నీకు అన్నది ,జానకి , నాకు కనిపించారు , భలే కరెక్ట్ , కదూ,'అవునే ,స్కూల్ లో టీచర్ గారికి చెబుదాం , అనుకున్నాము దానికి ఏడుపు వచ్చింది ,నాకు కూడా ఏడుపు వచ్చింది   ,  ,             
          ఆరోజు  క్లాసులో ఒకటే హడావిడిగావున్నాము ,మా పి.ఎస్ టీచర్ జార్గే మాణిక్యం గారు ఎప్పుడు వస్తార ,ఎపుఉడు చెబుదామ , అని టెన్షన్ ,టెన్షన్ గ వుంది, ఆమె మూడవ పిరియడ్ రానే వచారు ,ఇద్దరం ఒకేసారి చెప్పాము ,రాత్రి జరిగిన సంగతి , ఆమె ఓ గాడ్ ! వీళ్ళకు కనిపించావ, అని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా , ఆనందముగా అన్నారు ,; ఆరోజు క్లాసు జరగా లేదు , మరి మా హెడ్ మాస్టారు గారికి ఏమి చెప్పారో తెలియదు మరునాడు మా ఇద్దరిని పిలిచి ప్రయెర్ హాల్లో అంతా చెప్పా మన్నారు , ఇద్దరమూ ఒకళ్ళ తరువాత ఒకళ్లము జీసస్ !;'  ఎలా కనిపించింది చెప్పాము, అందరు చప్పట్లు కొట్టారు మేము చాల గర్వముగా ఫీల్ అయ్యాము, మా ఇద్దరి పేరు అందరికి తెలిసి పోయింది , టీచర్ కూడా ఆమె చెప్పినట్లు చేసినందుకు , మా ఇద్దరినీ స్పెషల్ గా చూసేది,  ఆజానకి, ఇప్పుడు ఎక్కడ ఉన్నదో తెలియదు , ఆ తరువాత  మేము మా నాన గారి పని రిత్య చీరాలకి వెళ్లి పోయాము , పదవతరగతి, అక్కడే కస్తురిబా గరల్స్ హై స్కూల్ లో చదివాను , మా అత్తాయి , వద్దని ఏడిచింది , పాపం ఆమెకు మాతోటి బాగా అలవాటు అయింది , చీరాల ఛిన  బొంబాయి అంటారు , అక్కడ బట్టలకోట్లు ఎక్కువ , స్కూల్ లో అందరు వాళ్ళ పిల్లలే వున్నారు, నాకు చాల మంది ఫ్రెండ్స్ అయ్యారు , సావిత్రి ,గాయత్రి , ఉమా, భారతి రాణి , విజయ, పార్వతి, భలే మాట్లాడేవాళ్ళు, కాని ఎప్పుడు ఎస్ .ఎ .హైస్కూల్ గుర్తుకు వచ్చేది .నాకు తెలుగు ,ఇంగ్లీష్ , మాస్టర్ నచ్చారు, డిసెంబరు , వచ్చింది, ఎక్స్కర్షన్ , వేసారు ,ఎక్కడికో తెలుసా ,అజంత ,ఎల్లోరా ,ఆ చుట్టూ పక్కల అన్ని చుపిస్తారట, వారం రోజులు డెబ్బయ్ రూపాయలే , టిఫెన్,భోజనము, అన్ని , అందరు పేర్లు ఇచ్చారు నేను మా నాన్న గారిని అడిగాను అమ్మని అడుగు అన్నారు , వెళ్ళమన్నారు మా అమ్మ గారు ,రెండు బస్సులలో రెడి అయ్యాము అందరు గోల గోల .పాటలు డాన్సులు , ఎగరడం , కాసేపు బస్సులు రెండు పోటి ,ఏది ముందు ఏది వెనక, మేము హిప్ హిప్ హుర్రే ,' అని అరెచేవాళ్ళం ,మా టీచర్ గార్లు కూడా మాతో నవ్వే వాళ్ళు, మహారాష్ట్ర లోకి , అడుగుపెట్టాము , ఎంట్రన్స్ లోనే వీర శివాజీ ;'! గుర్రం ఎక్కి నిలబడ్డ విగ్రహం కనబడింది , మా ఇంగ్లీష్ మాష్టారు బస్సుదిగి అందరికి మహారాష్ట్రలోకి వచ్చాము , అందరు జాగ్రత్తగా వుండాలి , టీచర్స్ చెప్పినట్లుగా వినండి అని చెప్పారు, అందరమూ బుద్దిగా తలలూపాము, మొదటగా అజంత వెళ్ళాము,ఆరోజు అందరు కెమెరాలు తెచ్చారు  ,పట్టు పరికిణీలు కట్టారు , నేనుకూడా కెమెరా తీసి చాల ఫొటోస్ తీసాను , భుద్దుడు మూడు వేల సరా"లకు పూర్వం అక్కడకు వచ్చాడని ,చెబుతారట ,అలా అర్ధచంద్రాకారంలో కొండను తోలిచారు  ముప్పయి రెండు గుహలు అన్నింటిలో రక రకాలయన పెయింటింగ్స్ ,వున్నాయి, వాటిని  ఆకు ,పండ్లు , పసర్లతో వేసారట , అబ్బ ఎంత బాగున్నాయో ! అక్కడ వున్న  గైడు , వివరించాడు, ఆ పెయింటిగ్స్ లోనుండే మనవాళ్ళు శామియానలకు ,డిజైన్ తెస్తారట, ఇన్ని రోజులయినా చెక్కు చెదరలేదు ,  దాదాపు మూడు వేల సం " లు ఐన  కూడా   కొత్తదనం పోలేదు , అది అందరిని ఆశ్చర్యంలో ముంచింది , ఒకచోట బుద్దుడు ధ్యానం చేస్తున్నట్లు , వున్నా ఒక విగ్రహం  కనపడింది , అందరు అటు తిరిగారు గైడ్, అప్పుడు చెప్పాడు ఆ విగ్రహంలో ,మూడు రకాల బుద్దుడు కనపడతాడు ఎలా అంటే ,ఎదురుగా చూస్తే ధ్యానం చేస్తున్నట్లు , పక్కగా చూస్తే , నవుతున్నట్లు , ఎడమ వైపు చూస్తే , మనల్ని చూస్తున్నట్లు వుంటుంది. అందరికి సంతోషం వేసింది . ఆరోజు ఇకమావల్ల కాదు , విశ్రాంతి కావాలని  అందరు గోల చేసారు మా సర్ కూడా ఒప్పుకున్నారు . మరునాడు ఎల్లోరా " గుహలు చూసాము, అక్కడ కూడా బుద్దునికి సంభందించినవే , అన్ని వున్నాయి , అవి కూడా ముప్పయ్ రెండు గుహలే , ఆ తరువాత దవులతాబాదు" కోట , ఆగ్రా  తాజమహలు , లాంటి డూప్ , చూసాము , అక్కడ షాజహాన్ , కట్టిస్తే ఇక్కడ దవులతాబాదు రాజు తన రాణి కోసం కట్టించాడట. తాజమహలు ముందు పెద్ద గులాబి తోట వున్నది అక్కడ వున్నా పూలు  మరెక్కడా లేవంటే , నమ్మండి , ఎవరైనా తాకితే , ఫైన్ అని చెప్పారు , ఈలోపల ఒక అమ్మాయి కోయడం అయి పోయింది గొడవ జరిగింది , మని కట్టి బయట పడ్డామను కొండి , అవురంగాబాదు కోటలో జ్యోతిర్లింగమున్నది," అందరు పూజలు చేసారు , అందరం అక్కడచేప్పేవాన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాము .ఆ మరునాడు నాసిక్ " వెళ్ళాము అక్కడే గోదావరి " పుట్టిందట , అక్కడ ఒక దిగంబరస్వామిని , చూసాము చాల లావుగా , వున్నాడు , కదలలేడు, అందరికి వీబూది., ఇచ్చాడు , అక్కడ ఒకటే కోతులు , మా వెంట పడ్డాయి , మా దగ్గర వున్నా జామకాయలు పడేసాము ,         
                                              
                                                               ,.