తావన్నిజ పరివారోరక్తః
పశ్చా జ్జీవతి జర్జర దేహే
వార్తాం కో పి న పృచ్ఛతి గేహే
భావం :నువ్వు ధనార్జన చేస్తున్నంత వరకే నీ సంసారం మరియు నీ పరివారం నిన్ను పట్టించుకుంటుంది. అనంతరం ముసలి తనం రాగానే, ఆర్జన ఆగినప్పుడు, ఎవరు నిన్ను పట్టించు కోరు, ఈలోపలే యదార్ధం తెలుసుకుని మసలుకో . ధనము వున్నా లేకున్నా నిన్నుఆదరించేది అ భగవంతుడే అని అర్ధము చేసుకుని సేవించు.శ్లో; మా కురు ధనజన యోవనగర్వం
హారతి నిమేషత్కా ల స్సర్వమ్
మాయమయ మిద మఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భావం; ధనమును, జనమును, యోవనమునూ, నమ్మి గర్వము నందకుము, కాలము వీటన్నిటిని ఒకేఒక త్రుటిలో మాయముచేయగలదు సుమా!కావున, ఈ ప్రపంచమంతయు మాయలో నిండియున్నాడని తెలుసుకొనుము,దీనిపై మమకారములు వీడి బ్రహ్మపదమే శాస్వతమని ఎరిగి దానిని పొందుటకై ప్రయత్నించుము.
శ్లో: అర్ధమనర్ధం భావయ నిత్యం
నాస్తి త త స్సుఖలేశ స్సత్యమ్
పుత్రా దపి ధన భాజాం భీతి:
సర్వత్రైషా విహితా రీతి:
భావం; ధనము అనర్ధదాయక మైనదని సదా తలంచుము అటువంటి ఆ ధనము వలన సుఖము లేసమైనను నిజముగా లేదు. ధనమువలన సంతతితో కుడా భితియే కలుగుచున్నది. కావున, సర్వత్రా ధనలాలన విసర్జించవలేనని భావము .
భావం; ధనము అనర్ధదాయక మైనదని సదా తలంచుము అటువంటి ఆ ధనము వలన సుఖము లేసమైనను నిజముగా లేదు. ధనమువలన సంతతితో కుడా భితియే కలుగుచున్నది. కావున, సర్వత్రా ధనలాలన విసర్జించవలేనని భావము .
.
No comments:
Post a Comment